Site icon HashtagU Telugu

CM KCR: ఈ నెల 9న కామారెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!

KCR Injured

Will Kcr's Unexpected Strategies Work

CM KCR: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్వంలో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేసిన ఆయన దైవ శక్తులను కూడదీసుకున్నారు. తాజాగా ఇవాళ సిద్దిపేటలోని కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పాదాల ముందు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు.

ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్న పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే కొనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు.  హరీష్ రావు కూడా కేసీఆర్ వెంట ఇదేరోజు తన నామినేషన్ పత్రాలతో ఆలయానికి వచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చేపట్టిన రాజశ్యామల యాగం నిన్నటితో ముగియడంతో.. నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.

1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. ఆ ఎన్నికల్లో ఆయన విజయకేతనం ఎగురవేశారు. అప్పటినుంచి ఈ ఆలయం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తూ వచ్చారు. పార్టీ ప్రకటన, ఉద్యమంలో ఏ కీలక నిర్ణయం అయినా ఇక్కడ పూజలు చేశాకే ప్రకటించేవారు కేసీఆర్. మంత్రి హరీష్ రావు కూడా ఈ సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు.

Also Read: Samantha: పింక్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న సమంత, లేటెస్ట్ పిక్స్ వైరల్