Site icon HashtagU Telugu

CM KCR: అర్జున అవార్డుకు నిఖత్ జరీన్ అర్హురాలు!

Nikhar Zareen Cm

Nikhar Zareen Cm

క్రీడల్లో ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు రావడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా బాక్సింగ్ లో వరుస విజయాలను నమోదు చేస్తూ, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలని సీఎం అన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం తెలిపారు.