తెలంగాణ ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign)లో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) దూకుడు కనపరుస్తుంది. అధినేత కేసీఆర్ (KCR) దగ్గరి నుండి చిన్న చితక నేతలు , కార్యకర్తలు సైతం ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటన లతో బిజీ గా ఉంటె..లోకల్ నేతలు ప్రతి గల్లీ ని కూడా విడిచిపెట్టకుండా మరోసారి బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా లోను పెద్ద ఎత్తున గులాబీ పార్టీ ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ (BRS Praja Ashirvada Sabha) పేరుతో జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉత్సహం నింపుతున్న సీఎం కేసీఆర్..నేడు నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar ) జిల్లాలో పర్యటించబోతున్నారు. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ హాజరుకానున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు. దేవరకద్రలో, మధ్యాహ్నం 1:30 గం. గద్వాల్, మధ్యాహ్నం 2:40 గం. మక్తల్, సాయంత్రం 4:00గం. నారాయణపేట నియోజకవర్గాలు.. సీఎం పర్యటించనున్నారు. దీనికి సంబదించిన ఏర్పాట్లు బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు పూర్తి చేసారు. సభలకు పెద్ద ఎత్తున ప్రజలను తరలిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నిన్న ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ…కాంగ్రెస్ నేతలపై విరుచుకపడ్డారు.
Read Also : Varun – Lavanya Reception :అట్టహాసంగా వరుణ్-లావణ్య ల ‘రిసెప్షన్’..తరలివచ్చిన సినీ తారలు