Site icon HashtagU Telugu

CM KCR : తమిళనాడుకు కేసీఆర్, స్టాలిన్ కలిస్తే చర్చకు వచ్చేవి ఇవే

తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.

బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకుని, అనంతరం రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రంగనాథస్వామి వారిని దర్శించుకుని, ఆ తర్వాత విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోనే బస చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

చెన్నైలో కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిసే అవకాశముంది. వీరిద్దరికి మొదటి నుండి మంచి సంబంధాలున్నాయి. కేంద్రం విధానాలతో పోరాడే క్రమంలో కలిసొచ్చే పార్టీలని కలుపుకొని వెళ్తామని, బీజేపీ అధికారంలో ఉంటె కష్టమని కేసీఆర్ ఈ మధ్య మాట్లాడారు. స్టాలిన్ కూడా రాజకీయంగా, ఐడియాలజీ పరంగా మోదీని, బీజేపీని వ్యతిరేకించేవారే కాబట్టి ఈ అంశానికి సంబందించిన చర్చ జరిగే అవకాశముంది.

వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కలిసిన వీళ్ళ మధ్య రాజకీయ చర్చ ఉండే అవకాశముంది. ముఖ్యంగా
దక్షిణాది రాష్ట్రాల్లోకి మమతా బెనర్జీ ఎంట్రీ ఇద్దామనుకునే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ వీరిరువురు భేటీ అయితే ఈ అంశానికి సంబందించిన చర్చతో పాటు మోదీ విధానాలను ఎదుర్కొనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక వీరిద్దరూ అఫీషియల్ గా కలిస్తే థర్డ్ ఫ్రంట్ అంశానికి సంబందించిన చర్చ మరోసారి తెరపైకి వచ్బే అవకాశముంది.