Site icon HashtagU Telugu

BRS MLA Rohith Reddy: రోహిత్ రెడ్డికి కేసీఆర్ ‘లీగల్’ సపోర్ట్

Rohith Reddy

Rohith Reddy

గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌కు (Drugs) సంబంధించిన మనీలాండరింగ్ కేసు మరోసారి చర్చనీయాంశమవుతోంది. బెంగళూరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇంటరాగేషన్‌ను బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి (Rohith Reddy) ఎదుర్కొన్నాడు. అయితే ఆయన సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) ను కలిశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు BRS నాయకులను లక్ష్యంగా చేసుకున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి (Rohith Reddy) కేసీఆర్ నైతిక, చట్టపరమైన మద్దతును అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.

తాను ఏ తప్పూ చేయలేదని, ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలను ట్రాప్ చేసిన బీజేపీ ప్రయత్నాలను బయటపెట్టినందుకే పాత కేసులో ఇరికిస్తున్నారని రోహిత్ రెడ్డి  (Rohith Reddy) ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. ED విచారణను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పైలట్ కు కేసీార్ సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. మరికొంత మంది బిఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటుందని, వాటిని ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అయితే ఇప్పటికే ఈడీ ముందు హాజరైన రోహిత్ రెడ్డి (Rohith Reddy) మరోసారి ఈడీ విచారణకు హాజరుకాబోతున్నాడు.

మీడియాకు తాను ఏ ఫార్మాట్ అయితే ఇచ్చానో, అదే విషయంలో విచారణ జరిగిందన్నారు. విదేశీ పర్యటన, వ్యాపార లావాదేవీలపై ప్రశ్నలు అడిగారా అనే మీడియా ప్రశ్నకు బదులివ్వలేదు. విచారణలో ఈడీ అధికారులకు సహకరించి పూర్తి వివరాలు తెలిపానన్నారు. ఏ నేరానికి సంబంధించిగానీ, కేసుకుగానీ, ఆరోపణలపైగానీ, మనీ లాండరికింగ్ కు సంబంధించి విచారణకు పిలిచారా అని తాను ప్రశ్నించినా.. ఈడీ తనకు బదులివ్వలేదని రోహిత్ రెడ్డి (Rohith Reddy) అన్నారు.

Also Read: Anil Kapoor Request to Rishab Shetty: కాంతారా క్రేజ్.. ఛాన్స్ ప్లీజ్ అంటున్న అనిల్ కపూర్!