CM KCR :రెండురోజులపాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్..కవిత కూడా అక్కడే..!!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం యూపీ వెళ్లిన సీఎం కేసీఆర్...అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు.

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 06:53 AM IST

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం యూపీ వెళ్లిన సీఎం కేసీఆర్…అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఉణ్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత…కేసీఆర్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. యూపీ నుంచి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ పటేల్ మార్గ్ లో ఓ బంగ్లాను కిరాయికి తీసుకుని అందులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గంటపాటు బీఆర్ఎస్ ఆఫీసులో గడిపిన కేసీఆర్…కార్యాలయంలో కొన్ని మార్పులు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా వ్యవహారించడం…హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావును అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కవితకు గతంలో వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్టు చేయడం కలకలం రేపింది. అభిషేక్ విచారణ తర్వాత కవిత కూడా అరెస్టు అయ్యే చాన్స్ ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కవితతో కలిసి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. ఈ పర్యటనలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.