Site icon HashtagU Telugu

CM KCR : 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సమావేశం…!! మరో కీలక నిర్ణయం..!!!

Cmo

Cmo

హైదరాబాద్ ప్రగతి భవన్ లో 26 రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎ కేసీఆర్ . అల్పాహార కార్యక్రమం తర్వాత వ్యవసాయ, సాగునీటి రంగం వంటి అంశాలతోపాటు తెలంగాణ ప్రగతిపై రైతులకు వివరించారు. 26 రాష్ట్రాలకు చెందిన వంద మంది రైతుల సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. వారికి ఇవాళ వ్యవసాయం, సాగునీటి రంగం, తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని వారు తిలకించారు. తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన సదస్సులో పాల్గొన్నారు. భవిష్యత్ లో దేశంలోని వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవల్సిన చర్యలను సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు వివరిస్తున్నారు. నేతల అభిప్రాయాలను సీఎం పరిగణలోనికి తీసుకోనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విధానాలను అమలు చేసేలా తమ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం తమకూ ఉంటే బాగుండన్నారు. తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించం ఎంతో ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. ఇక మల్లన్న సాగర్ అద్భుతమన్నారు జాతీయ రైతు సంఘం నాయకులు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ను వారు సందర్శించారు. అనంతరం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.