CM KCR:మునుగోడుకు బయలుదేరిన కేసీఆర్.. ప్రసంగం కోసం ఆసక్తిగా ఉన్న ప్రజలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు బయలుదేరారు. అక్కడ నిర్వహించే ప్రజాదీవెన సభలో సీఎం ప్రసంగించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
CM kcr and telangana

CM KCR Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు బయలుదేరారు. అక్కడ నిర్వహించే ప్రజాదీవెన సభలో సీఎం ప్రసంగించనున్నారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరింది కాన్వాయ్. ముందు అనుకున్నట్లే కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో మునుగోడుకు వెళ్తున్నారు. సీఎంతోపాటు మంత్రులు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు 5వేలకు పైగా కార్లలో ర్యాలీ నిర్వహిస్తున్ారు. సీఎం కాన్వాయ్ ను అనుసరిస్తూ వెళ్తున్నారు. సీఎంకు ఉప్పల్ చౌరస్తాలో పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు.

ఇక టీఆరెస్ ప్రజాదీవెన సభకు కోసం మునుగోడులో పార్టీ నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు సభాస్థలికి చేరుకుంటున్నారు. 25ఎకరాల్లో లక్షన్నర మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం సభలో ఏం మాట్లాడతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలో మునుగోడుపై కేసీఆర్ వరాలజల్లు కురిపించే అకాశం ఉంది. ఇక ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మునుగోడు సభకు హాజరుకానున్నారు.

  Last Updated: 21 Aug 2022, 12:13 AM IST