CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వ‌స్తుంద‌ని హామీ ఇచ్చిన‌ కేసీఆర్‌.. కానీ, ఒక్క ష‌ర‌తు

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ మ‌రోసారి అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ స‌మావేశంలో ప‌టాన్ చెరు నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తాన‌ని వ్య‌క్తిగ‌తంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.

  • Written By:
  • Updated On - June 22, 2023 / 09:13 PM IST

తెలంగాణ‌ (Telangana) లో ఈఏడాది చివ‌రినాటికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల‌కోసం అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రోవైపు జిల్లాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో జోష్ నింప‌డంతో పాటు, స్థానిక ప్ర‌జ‌ల‌కు హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా గురువారం సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులో ప‌ర్య‌టించారు. డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల స‌ముదాయాన్ని ప్రారంభించిన‌ సీఎం, సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అదేవిధంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. అనంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే సంగారెడ్డి టూ హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోను మంజూరు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. మెట్రోరైల్‌ సంగారెడ్డికి రావాలంటున్నారు. తప్పనిసరిగా రావాలి. ఇటీవ‌ల మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి వెళితే మ‌హేశ్వ‌రానికి మెట్రో రావాల‌ని కోరారు. అక్క‌డే ఆ స‌భ‌లోనే నేను చెప్పా.. హైద‌రాబాద్ సిటీలో అత్య‌ధికంగా ట్రాఫిక్ ఉండే కారిడ‌ర్ ప‌టాన్ చెరు నుంచి దిల్‌సుఖ్ న‌గ‌ర్‌.

ప‌టాన్ చెరువు నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రావాల్సి ఉంది. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే మెట్రో త‌ప్ప‌కుండా వ‌స్తుంది. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి కేబినెట్ స‌మావేశంలో ప‌టాన్ చెరు నుంచి హ‌య‌త్ న‌గ‌ర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తాన‌ని వ్య‌క్తిగ‌తంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.

Ponguleti Srinivas Reddy : భ‌ట్టి విక్ర‌మార్క‌తో పొంగులేటి భేటీ.. ఖ‌మ్మం కాంగ్రెస్‌లో అస‌లు రాజ‌కీయం మొద‌లైందా?