BRS Tickets: మహిళలకు కేసీఆర్ మొండిచేయి, కేవలం ఏడుగురికే ఛాన్స్!

బీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 7గురు మహిళలే ఉండటం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 12:34 PM IST

పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం విడుదల చేసిన 115 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో ఏడుగురు మహిళలు మాత్రమే ఉన్నారు. పార్లమెంట్‌, శాసనసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని ఇటీవల కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నా నిర్వహించి, ఢిల్లీలో రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.  కవిత సొంత పార్టీ అధికార బీఆర్‌ఎస్ కేవలం ఏడుగురి మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై మీడియా ప్రతినిధులు రావును ప్రశ్నించగా.. ‘మహిళా రిజర్వేషన్‌ చట్టం లేకపోవడమే ఇందుకు కారణమని.. ఈ చట్టం ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించాలని అన్ని పార్టీలు ఆదేశించాయని.. కానీ బిల్లు ఇప్పటికీ పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి మేము మహిళలకు టిక్కెట్లు ఇచ్చాము పార్టీ అధినేత తేల్చి చెప్పారు. కాగా మహిళా రిజర్వేషన్ కోసం ధర్నా చేసిన కేసీఆర్ కుటుంబమే మహిళలను పక్కన పెట్టిందని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదిక గా రియాక్ట్ అయ్యారు.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కల్వకుంట్ల కవిత మంగళవారం రోజున ట్విట్టర్ ద్వారా తీవ్రంగా స్పందించారు.

Also Read: Mega157: బింబిసార డైరెక్టర్ తో చిరు కొత్త చిత్రం, భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ