Site icon HashtagU Telugu

CM KCR: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం!

KCR Strategy

Kcr Twitter Telanganacmo 18122021 1200x800

CM KCR: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ గులాబీ కండువా కప్పుున్నారు. తోట చంద్రశేఖర్ తో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి, పలువురు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనతో పాటు ఢిల్లీ పనిచేస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రావెల కిషోర్ బాబుకు అంబేర్కర్ వాదం, దళితుల సమస్యలపై బాగా అవగాహన ఉందని, దేశవ్యాప్తంగా అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయనను ఉపయోగించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరుతామని ఏపీ నుంచి తనకు చాలా కాల్స్ వస్తున్నాయని, సిట్టింగ్ లు కూడా ఫోన్ చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు పుంజుకుంటాయని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారని, బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే.. బీఆర్ఎస్ పవర్ లోకి వస్తే మళ్లీ జాతీయకరణ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. మోదీ అమ్ముతున్న సంస్థలను వాపస్ తీసుకుంటాన్నారు.మీది ప్రైవేట్‌నైజేషన్ అయితే మాది నేషనైలేజషన్ అని కేసీఆర్ మోదీ విధానాలపై మాట్లాడారు. సంక్రాంతి తర్వాత 7 నుంచి 8 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తాన్నారు. ఏపీలో కూడా పార్టీని నిర్మిస్తామని, చాలామంది నేతలు చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఏపీలో మేం కర్తలం, భర్తలం అనే ధోరణి పోవాలన్నారు.