ఎలక్షన్స్(Elections) దగ్గరకు వస్తున్న తరుణంలో తెలంగాణ(Telangana)లో అన్ని పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కూడా బయటకి వస్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక సీఎం కేసీఆర్(CM KCR) కూడా ఇటీవల వరుసగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ సూర్యాపేట(Suryapet) ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు.
ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్(Congress) పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. ఏం అభివృద్ధి చేశారు? కాంగ్రెస్ పాలనలో ప్రజలను, రైతులను బానిసలుగా చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా చూసుకున్నాము. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? తెలంగాణలో పెన్షన్ మరింత పెంచుతాం. కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపిస్తే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. కర్ణాటక కష్టాలు మనమూ కొనితెచ్చుకుందామా? కాంగ్రెస్ పాలనలో ముక్కు పిండి ప్రజలకు మూసీ మురికి నీళ్ళు తాగించారు. కాళేశ్వరం జలాలతో పంటలను మేం సస్యశ్యామలం చేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 సీట్లు గెలిచి తీరుతాం. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ మొత్తంలో గత ఎన్నికల కంటే ఈ సారి 5 నుంచి 10 సీట్లు ఎక్కువ సాధిస్తాం అని తెలిపారు.
ఇక ధరణి గురించి సభలో మాట్లాడుతూ.. ధరణితో కష్టాలు తొలగిపోయాయి. అక్రమాలకు చెక్ పడింది. ధరణి తొలగిస్తే రైతు బందు, రైతు భీమా పథకాలు ఎలా ముందుకు తీసుకెళ్తాము. ధరణి అనేది రైతు యొక్క భూమి హక్కు. పట్టా రైతు లేకుండా పేరు తొలగించే అధికారం ఎవరికీ లేదు అని అన్నారు. మరి కేసీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందో చూడాలి.
Also Read : Congress Reshuffle : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రఘువీరా రెడ్డి, సచిన్ పైలట్