CM KCR: కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో క‌లిపేద్దాం .. బీఆర్ఎస్‌తోనే రాష్ట్రం సుభిక్షం

కేసీఆర్ నిర్మ‌ల్(Nirmal) జిల్లా కేంద్రంలో ప‌ర్య‌టించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మీకృత భ‌వ‌నాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్(BRS) పార్టీ జిల్లా కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఎల్ల‌పెల్లిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 09:00 PM IST

సీఎం కేసీఆర్(CM KCR) కాంగ్రెస్(Congress) పార్టీపై విరుచుకు ప‌డ్డారు. ఆ పార్టీని బంగాళాఖాతంలో క‌లిపివేయాలంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఆదివారం కేసీఆర్ నిర్మ‌ల్(Nirmal) జిల్లా కేంద్రంలో ప‌ర్య‌టించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మీకృత భ‌వ‌నాన్ని, అదేవిధంగా బీఆర్ఎస్(BRS) పార్టీ జిల్లా కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఎల్ల‌పెల్లిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామనడం హాస్యాస్పదంగా ఉంద‌ని కేసీఆర్ అన్నారు. గ‌తంలో రెవెన్యూ శాఖ‌లో భ‌యంక‌ర‌మైన దోపిడీ జ‌రిగేది. ఎవ‌రి భూమి ఎవ‌రి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదు. ధ‌ర‌ణి(Dharani)తో రైతుల బాధ‌లు పోయాయి. అలాంటి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప‌ట్టుకొని కాంగ్రెస్ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తామంటున్నారు. మ‌ళ్లీ పైర‌వీకారుల విధానం రావాలి, త‌ద్వారా వారి జేబులు నింపుకోవాల‌నేది కాంగ్రెస్ నేత‌ల ప్లాన్‌. ప్ర‌జ‌లంతా ఏక‌మై కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో క‌లిపివేయాల‌ని కేసీఆర్ అన్నారు.

నిర్మ‌ల్ జిల్లాపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు తలా 10లక్షల నిధులు విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. అదేవిధంగా నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 లక్షల చొప్పున‌, 19 మండ‌ల కేంద్రాల్లో ఒక్కో కేంద్రానికి రూ. 20 లక్షల చొప్పున మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా నెంబ‌ర్ వ‌న్ సాధించడం అభినందనీయమ‌ని అన్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి త్వరలో పునాది రాయి వేస్తామ‌ని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామనడం హాస్యాస్పదంగా ఉంద‌ని, భూముల గోల్ మాల్ కోసం యత్నించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుకు డబ్బులు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలోనే ప‌ర్ క్యాపిట‌ల్‌లో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ప్రతి తండాకు లక్ష రూపాయల నిధులు అంద‌జేస్తామ‌ని అన్నారు. మహారాష్ట్రలో అప్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదానికి అపూర్వ స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు.

 

Also Read :  Telangana Jana Samithi: టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రామ్ ఎందుక‌లా అన్నారు.. అలాచేస్తే ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరుతుందా?