CM KCR Sankranti Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్

దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు (CM KCR Sankranti Wishes) తెలిపారు. మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.

Published By: HashtagU Telugu Desk
Cm Kcr 700 Medical Students

Cm Kcr 700 Medical Students

దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు (CM KCR Sankranti Wishes) తెలిపారు. మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు. ఒకప్పుడు సాగు దండగ అన్న తెలంగాణలో నేడు పండగ అయ్యిందని తెలిపారు. వ్యవసాయ ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయం పండగ అయినప్పుడే అసలైన సంక్రాంతి అని అన్నారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్‌ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని చెప్పారు. ప్రజల మద్దతు, సహకారం, సమన్వయ ప్రయత్నాలతో దేశంలో వ్యవసాయ రంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, గుణాత్మక మార్పుకు నాంది పలికేందుకు చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read: Ro Khanna Profile: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రో ఖన్నా..?

రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ఇప్పటి వరకు రూ.2,16,000 కోట్లు ఖర్చు చేసిందని, సంక్షేమం, అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది అద్దం పడుతుందని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక రైతు సంక్షేమ వ్యవసాయరంగ అభివృద్ధి కార్యాచరణతో నాడు రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1 కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే వున్న సాగు విస్తీర్ణం, నేడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామని సీఎం తెలిపారు. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగ అయిందని, వసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతున్నదని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదు కొల్పుతామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం వుందన్నారు.

  Last Updated: 15 Jan 2023, 09:14 AM IST