Site icon HashtagU Telugu

KCR Delhi Tour : జాతీయ పార్టీల‌కు ‘కేసీఆర్’ ఢిల్లీ స్ట్రోక్‌

Kcr Delhi Stroke

Kcr Delhi Stroke

కేసీఆర్‌ ఢీల్లీ టూర్ పై అంద‌రి చూపు ప‌డింది. ఆయ‌న అక్క‌డ ఎవ‌ర్ని క‌ల‌వ‌బోతున్నాడు? జాతీయ స్థాయి రాజ‌కీయాల‌పై ఎలాంటి వ్యూహాన్ని ర‌చించ‌బోతున్నాడు? ఢిల్లీ కేంద్రంగా ఆయ‌న వేసే ఎత్తుగ‌డ‌లు నిజంగా మోడీ స‌ర్కార్ కు ఇబ్బంది క‌లిగించేవా? తెలంగాణ రాష్ట్రంలోని జ‌నం మూడ్ ను మార్చ‌డానికి మాత్ర‌మే కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడా? అందుకే జాతీయ కూట‌మి అంటూ ప్ర‌చారం చేస్తున్నాడా? అనే ప్ర‌శ్న‌లు వేసుకుంటే..ఔన‌నే స‌మాధానం లీల‌గా క‌నిపిస్తోంది.హుజురాబాద్ ఫ‌లితాల ( Huzurabad Elections) త‌రువాత టీఆర్ఎస్ ప‌ని గోవిందా అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌జ‌లు కూడా బీజేపీ వైపు దృష్టి పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు దూకుడుగా వెళ్లిన పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ (Revanth Reddy) హ‌వా క‌నుమ‌రుగు అయింది. బీజేపీ ఫోక‌స్ కావ‌డాన్ని కేసీఆర్ గ‌మ‌నించాడు. వెంట‌నే వ‌రి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. దాదాపు నెల రోజుల పాటు అ అంశం చుట్టూ క‌థ న‌డిపాడు. కొంత మేర‌కు తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టిని హుజురాబాద్ ఫ‌లితాల నుంచి ప‌క్క‌కు నెట్టింది. ఆ త‌రువాత 317 జీవోతో మ‌ళ్లీ ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించ‌డానికి బీజేపీ ఎత్తుగ‌డ వేసింది. దానికి చెక్ పెట్టేలా జాతీయ స్థాయిలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్, కొత్త పార్టీ (Federal Front) అంటూ కేసీఆర్ మీడియా ముందుకొచ్చాడు.

దీంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ గురించి ఆలోచించే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ప్ర‌జా దృష్టిని త‌న‌వైపు కేసీఆర్ పూర్తిగా తీప్పుకున్నాడు. తాజాగా ఆయ‌న ఢిల్లీ వెళ్లి ఏం చేయ‌బోతున్నాడు అనే దానిపై చ‌ర్చ న‌డుస్తోంది.
2018లో జరిగిన ఎన్నికల నుండి అసెంబ్లీలో బీజేపీ కేవ‌లం ఒకేఒక ఎమ్మెల్యే టి.రాజా సింగ్‌ను (MLA Raja Singh) క‌లిగి ఉంది. ఇప్పుడు దుబ్బాక‌, హుజ‌రాబాద్ (Dubbaka, Huzurabad) ను గెల‌చుకోవ‌డంతో త్రిమూర్తుల్లా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు, జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. గత మూడేళ్ళలో హుజూర్‌నగర్ , నాగార్జునసాగర్‌లలో రెండు ఉపఎన్నికలలో కాంగ్రెస్ చావు దెబ్బతింది. దీంతో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయ బీజేపీగా తెలంగాణ‌లో క‌నిపించేలా గేమ్ న‌డుస్తోంది. ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకుంటున్నారని తాజా స‌ర్వేల సారాంశం. అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ను (Telangana Congress) నమ్మడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ శాసనసభ్యులు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సులభంగా వెళ‌తార‌ని ప‌జ‌లు న‌మ్ముతున్నారు. ఎనభై శాతం మంది బీజేపీని కోరుకుంటున్నార‌ని కొన్ని నెలల క్రితం పాదయాత్ర చేసిన‌ సంజయ్ (BJP Chief Bandi Sanjay) స్లోగ‌న్ వినిపించాడు.

Also Read :  మూడు పార్టీల ముద్దుల‌ ‘పీకే’

విప‌క్షాలు రెండు బ‌లంగా ఉన్నాయ‌ని గ్ర‌హించిన టిఆర్ఎస్ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (CM KCR) వ్యూహాత్మక మాస్టర్‌స్ట్రోక్‌ను ప్లే చేస్తున్నాడు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల చుట్టూ ఉన్న రాజ‌కీయ క్రీడ‌ను లోక్‌సభ ఎన్నికల( Loksabha Elections) వైపు వ్యూహాత్మంగా మార్చేశాడు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ రాష్ట్ర రాజ‌కీయాలు, అభివృద్ధి గురించి ప్ర‌జ‌లు చ‌ర్చించుకునే స‌మ‌యం లేకుండా చేశాడు. రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని నిర్ణయించే 2023 ఎన్నికల దిశ‌గా దూకుడుగా వెళుతోన్న సంజయ్ , రేవంత్ రెడ్డిల ప్ర‌య‌త్నానికి ఒక్కసారిగా కేసీఆర్ బ్రేక్ వేశాడు. మోడీ ప్ర‌భుత్వాన్ని(PM Narendra Modi) టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కేంద్ర నాయకత్వాన్ని నిరంతరం ప్రశ్నించడం, విమర్శించడం, డిమాండ్‌లు చేయడం ద్వారా తెలంగాణ బీజేపీ(Telangana BJP) నోరెత్త‌కుండా చేస్తున్నాడు. చంద్రశేఖర్ రావు, కె.టి.ఆర్ ల పదునైన మందలింపుల వల్ల వారికి ప్రయోజనం లేదు. కేటీఆర్ ఇతర టీఆర్‌ఎస్ నాయకులు. గతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఆయన చేసిన బలమైన దూషణలకు పూర్తి భిన్నంగా, చంద్రశేఖర్ రావు ఆయనను సమర్థిస్తూ, మద్దతుగా నిలిచాడు. రేవంత్ రెడ్డిని రాజ‌కీయ‌ నిరాయుధులను చేయడం కోసం ప‌క్కా ప్లాన్ చేశాడు. మోడీ వ్యతిరేక ఫ్రంట్ సందేశం మాస్టర్‌స్ట్రోక్‌గా ఉంది. ఢిల్లీలో మోడీని సవాలు చేయడానికి, ఓడించడానికి ఫ్రంట్‌ను ఏర్పాటు చేయగల ఏ నాయకుడైనా ఎటువంటి అధికార వ్యతిరేకతను ఎదుర్కోలేరని ప్రజలు విశ్వసిస్తున్నారు. మున్ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ల‌క్ష్యంగా కేసీఆర్ అస్త్రాల‌ను విసురుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలతో చర్చలు జరపడం వల్ల చంద్రశేఖర్‌రావు స్థాయి పెరిగింది. ఆయ‌న క‌లిసిన నేత‌ల్లో ఎం.కె. స్టాలిన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, హెచ్.డి. దేవెగౌడ (MK Stalin, Mamatha Benarjee, Uddhav Thakarey, Sarad Pawar, HD Dewegowda)  తదితరులు ఉన్నారు. సోమ‌వారం ఢిల్లీ వెళ్లిన ఆయ‌న మూడు రోజుల పాటు అక్క‌డే ఉంటారు. కేజ్రీవాల్ తో స‌హా అందుబాటులో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల అధిప‌తుల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పే ఛాన్స్ ఉంది. సేమ్ టూ సేమ్ 2018లో మాదిరిగానే ఇప్పుడు కూడా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. కానీ, ఈసారి ఢిల్లీ చ‌క్రం తిప్ప‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని గులాబీ శ్రేణుల ఉవాచ‌. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముందుగా అధికారంలోకి వ‌స్తేనే, ఆయ‌న క‌ల‌లు నిజం అయ్యేది.