Site icon HashtagU Telugu

KCR Strategy: కేసీఆర్ సంచలనం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం!

KCR

The Child Of India.. Will Always Come To Maharashtra.. Kcr

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (BRS) గా మార్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ముందుట దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పై గురి పెట్టిన ఆయన కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడంలో సక్సస్ అయ్యారు. ఆ ఉత్సాహంతో కేసీఆర్ ఇతర రాష్ట్రాలను ద్రుష్టి సారిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM KCR) కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సంస్థ‌కు మూల‌ధ‌న పెట్టుబ‌డితో పాటు ముడి స‌రుకుల కోసం నిధులు ఇచ్చి.. ఉక్కు ఉత్ప‌త్తుల‌ను కొనేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేప‌థ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో సింగ‌రేణి త‌ర‌ఫున రాష్ట్ర ఖ‌నిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుద‌ల శాఖ పాల్గొనే అవ‌కాశం ఉంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ త‌మ వైఖ‌రిని తెలియ‌జేయ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌డం, తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు ఉక్కును స‌మ‌కూర్చుకోవ‌డం వంటి ల‌క్ష్యాల‌తో కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ ప్ర‌తిపాద‌నల కోసం వెంట‌నే వైజాగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్న‌తాధికారుల బృందాన్ని కేసీఆర్ ఆదేశించారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ బృందం విశాఖ‌ప‌ట్నం వెళ్ల‌నుంది.

ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌-ఈవోఐ(ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌) రూపంలో ప్రైవేటు కంపెనీల‌ను స్టీల్ ప్లాంట్‌లోకి చొప్పించి.. అంతిమంగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుప‌రం చేసేందుకు కేంద్రం ప‌న్నిన కుట్ర ఇద‌ని కేంద్రానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ‌, కార్మిక సంఘాల నుంచి సానుకూల స్పంద‌న వ‌చ్చింది. దీనిపై బీఆర్ఎస్ ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ ఇటీవ‌ల విశాఖ‌లోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌ను క‌లిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు తాత్కాలిక ప‌రిష్కార మార్గాల‌ను ఈ సంద‌ర్భంగా వారు వివ‌రించారు. ఈ స‌మాచారాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దృష్టికి చంద్ర‌శేఖ‌ర్ తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: Renudesai: పవన్ కళ్యాణ్ అభిమానిపై రేణుదేశాయ్ ఫైర్!