CM KCR : తెలంగాణ పల్లెలకు ఏకంగా 13 అవార్డులు.. సీఎం కేసీఆర్ అభినందనలు..

ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు - అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎంపికైన 46 ఆదర్శ గ్రామాలకు అవార్డులను అందచేశారు.

Published By: HashtagU Telugu Desk
CM KCR congratulated the village leaders who received Gram Panchayat awards

CM KCR congratulated the village leaders who received Gram Panchayat awards

ఇటీవల దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల(Awards) కింద దేశంలోని పచ్చదనం, పరిశుభ్రత, వివిధ రంగాల్లో ముందున్న గ్రామాలని(Villages) అభినందిస్తూ అవార్డులు ప్రకటించారు. దేశంలో 2 లక్షలపైగా గ్రామాలు ఉండగా, అనేక గ్రామాలు ఇందులో పోటీ పడ్డాయి. చివరకు 46 గ్రామాలు మాత్రమే ఈ అవార్డులను అందుకోగా అందులో 13 గ్రామాలు తెలంగాణకు(Telangana) చెందినవే కావడం విశేషం.

సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు – అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎంపికైన 46 ఆదర్శ గ్రామాలకు అవార్డులను అందచేశారు.

దీనిపై కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి అనడానికి ఇదే నిదర్శనం. దేశవ్యాప్తంగా 2.5 లక్షల పల్లెలు ఉండగా అందులో ఆదర్శ పంచాయతీల అవార్డులకు కేవలం 46 గ్రామాలు ఎన్నికయ్యాయి. అందులో 13 మన తెలంగాణ గ్రామాలు ఉండటం ఆనందకరమైన విషయం. ఆ 13లో నాలుగు ఫస్ట్ ర్యాంక్స్ కూడా తెలంగాణకే రావడం సంతోషం. అవార్డుల్లో దాదాపు ౩౦ శాతం మనకే రావడం గర్వకారణం. ఇదే స్పూర్తితో BRS తరపున భవిష్యత్తులో దేశంలోని పల్లెలు కూడా ప్రగతి పథంలో సాగేలా చూస్తాము అని అన్నారు. ఈ అవార్డులు సాధించడంతో ఆయా గ్రామాల సర్పంచ్ లు, అధికారులు, BRS నాయకులను కేసీఆర్ అభినందించారు.

 

Also Read :   T Congress :రేవంత్ మార్క్ ,ప్రేమ్ సాగ‌ర్ రావుకు ఎస‌రు

  Last Updated: 17 Apr 2023, 09:53 PM IST