Site icon HashtagU Telugu

TS : స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో నెంబర్..1 గా తెలంగాణ…కేసీఆర్ హర్షం..!!

Kcr Imresizer

Kcr Imresizer

స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు ఇది నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. గ్రామీణ స్వచ్చభారత్ మిషన్ లో తెలంగాణకు 13 అవార్డులు వచ్చాయని తెలిపారు. పల్లె ప్రగతిని సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే పరంపరను కొనసాగిస్తామంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.

స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్..ర్యాకింగ్స్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్చ్ భారత్ మిషన్ దివస్ 2022 కింద తెలంగాణకు కేంద్రం 13 అవార్డులను అందజేసింది. SSGసౌత్ జోన్ ర్యాంకింగ్స్ లో నిజామాబాద్, భద్రాద్తి కొత్తగూడెం రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. సుజలం క్యాంపెయిన్, జాతీయ చలన చిత్ర పోటీలు, వాల్ పెయింటింగ్ తోపాటు పలు పోటీల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ వేదికగా ఈ జాబితాను పోస్టు చేశారు.