BRS Leader Death: తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ నేత కుసుమ జగదీష్ ఈ రోజు గుండెపోటుతో మరణించారు. జగదీష్ మృతి పట్ల సీఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. జగదీష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ ఈ రోజు ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. హనుమకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే కన్నుమూశారు జగదీష్. జగదీష్ పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు. జగదీష్ అంత్యక్రియలను సోమవారం జరపనున్నారు. ఈ అంత్యక్రియలలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
జగదీష్ మృతి వార్త తెలుసుకున్న సీఎం కెసిఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జగదీష్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. జగదీశ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం.
Read More: AP Kapu Politics; పవన్ దూకుడుకు జగన్ కళ్లెం!వైసీపీలో కి ముద్రగడ?