CM KCR: అసెంబ్లీ రద్దు…ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ… బీజేపీ ఇరకాటంలో పడిందా..?

తెలంగాణలో అధికారం మాదే. టీఆరెస్ సర్కార్ ను పడగొడతాం. కేసీఆర్ ఊచలు లెక్కపెట్టేలా చేస్తాం. ఇక కల్వకుంట్ల కథ ముగిసినట్లే. రాబోయేది కాషాయ ప్రభుత్వం...అంటూ భీకరప్రకటన చేస్తోన్న బీజేపీ నేతలను ఇరుకునపెట్టారు సీఎం కేసీఆర్.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 08:00 AM IST

తెలంగాణలో అధికారం మాదే. టీఆరెస్ సర్కార్ ను పడగొడతాం. కేసీఆర్ ఊచలు లెక్కపెట్టేలా చేస్తాం. ఇక కల్వకుంట్ల కథ ముగిసినట్లే. రాబోయేది కాషాయ ప్రభుత్వం…అంటూ భీకరప్రకటన చేస్తోన్న బీజేపీ నేతలను ఇరుకునపెట్టారు సీఎం కేసీఆర్. మాటలు చెప్పడం కాదు…నిజంగా మీకు దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించండి. అప్పుడు నేనే స్వయంగా అసెంబ్లీని రద్దు చేస్తాను. అందరం కలిసి ఎన్నికలకు పోదాం..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. దాన్ని స్వీకరించలేదని స్థితిలో ఇప్పుడు బీజేపీ ఇరకాటంలో పడినట్లయ్యింది.

ఏక్ నాథ్ షిండేలతో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం…గజ్వేల్లో గెలుస్తాం లాంటి మాటలతో కేసీఆర్ ను కొట్టలేరని…ఒకవేళ ముందస్తుకు వెళ్లినా కేసీఆర్ ను తట్టుకోలేరని గులాబీ అధినేత హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే ప్రజలను ఏకతాటిపైకి తెచ్చామో…జాతీయపార్టీ పెట్టి తీరుతామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధివారంనాడు కీలక సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్.

జాతీయపార్టీ ఎఫ్పుడు పెడతారన్న ప్రశ్నకు …మీ కోరిక తప్పకుండా తీర్చుతా…ఆ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది…మీకన్నా ఎక్కువగా మోదీకి తెలుసు…పార్టీ ఎఫ్పుడు ప్రకటిస్తానన్న విషయం. తెలంగాణలో నేను బిజీగా ఉండేలా చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఏక్ నాథ్ షిండేను తీసుకురండి…అప్పుడు నేను బిజీ అవుతా…నాకు కొట్లాడుడు అలవాటే…అని కేసీఆర్ సమాధానమిచ్చాడు. టీఆరెస్ జాతీయపార్టీగా మారుతుందని అందులో ఏం తప్పుతుందని క్లారిటీ ఇచ్చారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బ్లాక్ మెయిలర్ మాదిరిగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆఱ్ ఫైటర్…కేసులతో ఏం జరగదు…మా దాంట్లో ఈడీ కేసులు పెట్టేంత దొంగలు లేరు. మేం కుంభకోణాలు చేయలేదు. తెలంగాణ బీజేపీ అదికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని…ఒక్కరిద్దరు బీజేపీలోకి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

అసెంబ్లీ రద్దుకు సిద్దమన్న కేసీఆర్…దమ్ముంటే ముందస్తు ఎన్నికల తేదీని ప్రకటించాలని సవాలు విసరడం ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టారన్న భావన కలుగుతోంది. బీజేపీ చెబుతున్నట్లుగా నిజంగానే టీఆరెస్ లో ఏక్ నాథ్ షిండేల ద్వారా ప్రభుత్వాన్ని కూలగొడితే…నేరుగా ప్రజల్లోకి వెళ్తానని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ ను కూలగొట్టలేక…కేసీఆర్ కుటుంబీకులను జైలుకు పంపలేక…కొన్నాళ్లపాటు బీజేపీ మాటలు, సవాలు విసరడం మరొకటి లేదన్న వాదన వినిపిస్తోంది.