Site icon HashtagU Telugu

CM KCR: దేశ ప్రజల కోసం మిమ్మల్ని గోకుతూనే ఉంటా…కేంద్రంపై కేసీఆర్ ఫైర్..!!

Kcr

Kcr

తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో…బీజేపీ నేతలపై,కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే ఏక్ నాథ్ షిండే లాంటి వాన్ని తెలంగాణలో తీసుకురా మోడీ అంటూ సవాల్ విసిరారు. నీ ఉడత ఊపులకు ఎవరు భయపడరంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ ఏక్ నాథ్ షిండే తరహాలో ఆనాడు కాంగ్రెస్ కూడా ఎన్టీఆర్ పై నాదెండ్ల భాస్కర్ ను ప్రయోగించిందని కేసీఆర్ అన్నారు. తర్వాత ప్రజలు తిరగబడ్డారని…మళ్లీ ఎన్టీఆర్ ను తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

నరేంద్రమోదీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్ నాథ్ షిండేలను తీసుకురావాలని కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లు రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటకు రావాలన్న కేసీఆర్ …అప్పుడే దేశంలో మార్పులు వస్తాయన్నారు. అంతేకాదు..అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటూ మరోసారి రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఎవరికీ భయపడను..నాకు డబ్బు లేదు…లాండరింగ్ లేదు…మాతో గోక్కుంటే అగ్గే…మీరు మాతో గోక్కున్నా..గోక్కోపోయినా దేశ ప్రజల కోసం నేను మిమ్మల్ని గోకుతూనే ఉంటా అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్.

Exit mobile version