Site icon HashtagU Telugu

KCR Trip: అర్థంతరంగా ముగిసిన కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన…ఏమైందో..?

Kcr

Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అర్థంతరంగా ముగిసింది. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈనెల 20న ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. 21న సమాజ్ వాదీ పార్ట చీఫ్ అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన కేసీఆర్…22న ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో సమావేశమయ్యారు. తర్వాత ఇద్దరూ కలిసి చంఢీగఢ్ చేరుకున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాకు మూడు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అక్కడివరకు సజావుగానే సాగిన పర్యటన నిన్న రాత్రితో అర్థంతంరంగా ముగిసింది.

ఏమైందో తెలియదు కానీ..నేడు, రేపు పులవురు ప్రముఖులతో జరగాల్సిన చర్చలు, సమావేశాలను రద్దుకు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు కేసీఆర్. ఈనెల 25న కేజీఆర్ బెంగూళు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ్, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు.27న మహారాష్ట్ర వెళ్లి రాలెగావ్ సిద్ధి వెళ్లి అన్నా హజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిర్డీ వెళి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్ చేరుకుంటారు.