Site icon HashtagU Telugu

CM KCR : రాజ్ భవన్ విందుకు సీఎం కేసీఆర్ దూరం!

tamilisai and cm kcr

tamilisai and kcr

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లు ఘన స్వాగతం పలికారు. ఐదు రోజుల దక్షిణాది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లోని వార్‌ మెమోరియల్‌ని రాష్ట్రపతి ముర్ము సందర్శించి అమర జవాన్లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో (Raj Bhavan) రాష్ట్రపతి విందును ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దూరంగా ఉన్నారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సీఎం ఆయన ఫామ్‌హౌస్‌కు బయల్దేరి వెళ్లారు. రాజ్‌భవన్‌లో జరిగిన విందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రధాని మోడీ పర్యటనలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ ముర్ము పర్యటించిన నేపథ్యంలో ఆయన ఘనస్వాగతం పలికారు. ఒక తమిళిసై, బండి సంజయ్, సీఎం కేసీఆర్ ఒకే స్టేజీ మీద కనిపించడం గమనార్హం.