KCR Tamilisai : ఔను! వాళ్లిద్ద‌రూ ఒక‌ట‌య్యారు!!

రాజ‌కీయాల‌ను సానుకూలంగా మార్చుకోవ‌డానికి ఎప్పుడూ కేసీఆర్ ముందుంటారు. మొన్న‌టి వ‌ర‌కు నువ్వా? నేనా? అన్న‌ట్టు పోట్లాడుకున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై , సీఎం కేసీఆర్ ఒక‌ట‌య్యారు. ఆ విష‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా వారం క్రిత‌మే లీకుల వ‌చ్చేయి. ఆ మేర‌కు `స‌యోధ్య `అనే హెడ్డింగ్ తో హాష్ ట్యాగ్ యూ క‌థ‌నం ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఇప్పుడే అదే నిజం కాబోతుంది.

  • Written By:
  • Updated On - June 28, 2022 / 12:22 PM IST

రాజ‌కీయాల‌ను సానుకూలంగా మార్చుకోవ‌డానికి ఎప్పుడూ కేసీఆర్ ముందుంటారు. మొన్న‌టి వ‌ర‌కు నువ్వా? నేనా? అన్న‌ట్టు పోట్లాడుకున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై , సీఎం కేసీఆర్ ఒక‌ట‌య్యారు. ఆ విష‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల ద్వారా వారం క్రిత‌మే లీకుల వ‌చ్చేయి. ఆ మేర‌కు `స‌యోధ్య `అనే హెడ్డింగ్ తో హాష్ ట్యాగ్ యూ క‌థ‌నం ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఇప్పుడే అదే నిజం కాబోతుంది.

తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్స‌వానికి రాజ్ భ‌వ‌న్ ముస్తాబ‌యింది. మంగ‌ళ‌వారం ఉదయం 10.05 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌రు కావాల‌ని సీఎం సంకేతాలిచ్చార‌ట‌. అందుకే, పూర్వంలా మ‌ళ్లీ రాజ్ భ‌వ‌న్ సీఎం కేసీఆర్‌, అధికారుల హ‌డావుడి క‌నిపించింది.

గతేడాది అక్టోబరు 11న చివరిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడు రాజ్ భ‌వ‌న్లో క‌నిపించారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికపైకి క‌నిపించారు. గవర్నర్ వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ కొంతకాలంగా రాజ్‌భవన్ వైపు చూడ‌లేదు. గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వాల‌కు ఆయ‌న‌ దూరంగా ఉండ‌డ‌మే కాకుండా మంత్రుల‌ను, ఉన్న‌తాధికారుల‌ను కూడా దూరంగా ఉంచారు.

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను క‌లిసి ఆయ‌నపై త‌మిళ సై ఫిర్యాదు కూడా చేశారు. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా ఆమె వెల్ల‌డించారు. తెలంగాణ‌లోని అవినీతి గురించి ఆమె బాహాటంగా మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ మంత్రులు రాజ్ భ‌వ‌న్ ప‌రువును తీస్తున్నార‌ని మండిప‌డ్డారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ పండుగ కోసం హెలికాప్ట‌ర్ ను స‌మ‌కూర్చ‌కుండా గ‌వ‌ర్న‌ర్ కు ప్ర‌భుత్వం హ్యాండిచ్చింది. ప్రొటోకాల్ కు త‌గిన విధంగా సీఎంవో ఆఫీస్ న‌డుచుకోలేదు. ఆ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ వేదిక‌గా పెద్ద ఎత్తున వెలిగెత్తిచాటారు. ఇద్ద‌రి మ‌ధ్యా ఒక యుద్ధం జ‌రిగింది. ఇటీవ‌ల ఆమె బ‌ర్త్ డే సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ విషెస్ తెలియ‌చేశారు. ఆ రోజు నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స‌యోధ్య‌కు బీజం ప‌డింది. ఇప్పుడు చీఫ్ జ‌స్టిస్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం సంద‌ర్భంగా ఒకే వేదిక‌పైకి వ‌చ్చారు. ఇలాగే, స‌యోధ్య కొన‌సాగుతుందా? మ‌ళ్లీ మొద‌టికొస్తుందా? అనేది చూడాలి.