Site icon HashtagU Telugu

CM KCR: నిఖ‌త్ జ‌రీన్‌కు రూ. 2 కోట్ల ఆర్థిక సాయం!

CM KCR

Resizeimagesize (1280 X 720) 11zon

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టిను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం (CM KCR) స్పష్టం చేశారు. సచివాలయంలో నిఖత్ జరీన్ సీఎంతో ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ. 2 కోట్లను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Also Read: RCB vs SRH: ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ధనాధన్… కీలక మ్యాచ్ లో బెంగుళూరు గ్రాండ్ విక్టరీ

ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ తో పాటు మంత్రులు శ్రీ మహమూద్ అలి, శ్రీ ప్రశాంత్ రెడ్డి, శ్రీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ బాల్క సుమన్, శ్రీ విఠల్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version