Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్!

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు.

Published By: HashtagU Telugu Desk
Singareni

Singareni

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికుల ఆనందానికి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూ. 368 కోట్లు  కేటాయించారు. అంటే 2021-22కి కంపెనీ లాభాల వాటాలో 30 శాతం కార్మికులకు బోనస్‌గా ప్రకటించారు. కార్మికులకు దసరా పండుగ కానుకగా అందజేసేందుకు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సింగరేణిలో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు సంబంధిత అధికారులు. బొగ్గు ఉత్పత్తి, రక్షణ.. సంస్థకు రెండు కళ్లలాంటివి. వీటిని సమాంతరంగా చూసుకుంటూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నారు. ఇటీవల శ్రీరాంపూర్‌ ఏరియాలో జరిగిన ప్రమాదంతో మరింత అప్రమత్తం అయ్యారు. గనుల వారీగా రక్షణ సమావేశాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. నిరంతం శిక్షణ, రక్షణపై సమీక్షలను ఓ విభాగం చూసుకుంటుంది.

  Last Updated: 28 Sep 2022, 02:47 PM IST