Site icon HashtagU Telugu

Chess Player: చెస్ లో తెలంగాణ కుర్రాడికి అంతర్జాతీయ ఖ్యాతి!

Chess Player

Resizeimagesize (1280 X 720) 11zon

అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు (Chess Player) ఉప్పల ప్రణీత్ (16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రణీత్ ను, వారి తల్లిదండ్రులను సోమవారం సచివాలయానికి పిలిపించుకుని, ప్రణీత్ ను దీవించారు. భవిష్యత్ లో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Also Read: New CM: సిద్ధరామయ్యే కర్ణాటక కొత్త సీఎం?… అధికారిక ప్రకటనే తరువాయి

కష్టపడి ప్రణీత్ కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. చెస్ క్రీడ పట్ల ప్రణీత్ కు ఉన్న అభిరుచి, కఠోర సాధనే అతనిని గ్రాండ్ మాస్టర్ గా తీర్చిదిద్దాయని సీఎం అన్నారు. భవిష్యత్ లో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడారంగాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగిన తీరే నిదర్శనమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ప్రణీత్ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.