Site icon HashtagU Telugu

KCR and Jagan : ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద!

Jagan-KCR

తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌ గారు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు.

అయితే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం చోటుచేసుకున్న వివాదం అందరికీ తెలిసిందే. నీళ్ల పంచాయితీ విషయంలో ఇద్దరూ సీఎంలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇక ఇరు రాష్ట్రాల మంత్రులయితే వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు.

నువ్వానేనా అన్నట్టు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేశారు. జలవివాదం నెలకొన్న తర్వాత మొదటిసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓకే వేదిక మీద కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలను పక్కనపెట్టి ఇద్దరూ సరాదాగా దాదాపు 20 నిమిషాలపాటు  ముచ్చటించుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. సీఎం లు కేసీఆర్, జగన్ ముచ్చట పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version