జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన ఫ్యామిలీ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ అనవరంగా రాద్ధాంతం చేస్తుందని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ పట్ల ఫోబియా పట్టుకుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కేటీఆర్ పట్ల ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేకపోతున్నందున, కేటీఆర్‌ను రాజకీయంగా అప్రతిష్ఠపాల్జేసేందుకు ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం చేస్తున్నారని విమర్శించారు.
ఫాంహౌస్‌పై తనిఖీలు జరపడం, కేటీఆర్ కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేయడంపై సీరియస్‌గా స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి అసూయతో ఈ చర్యలకు దిగుతున్నారని కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైన నేతలలో ఒకరిగా కేటీఆర్ ప్రసిద్ధి చెందారు. ఆయనకు ఉన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి కుట్రల వైపు పోతున్నారని కేపీ వివేకానంద అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను అప్రతిష్టపరచడానికి, వివిధ ఆరోపణలు చేస్తున్నారని, అయితే అవి నిరాధారమైనవని ఆయన అన్నారు. కేటీఆర్ తన కుటుంబానికి, రాజకీయ జీవితానికి కచ్చితమైన విధానాలను అనుసరిస్తున్నారని వివేకానంద వ్యాఖ్యానించారు.
ఫాంహౌస్‌పై దాడులు ,అక్రమ తనిఖీలు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న చర్యలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవుతున్నారని, ప్రజలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక కేసులో అక్రమంగా ఇరికించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్లి వెళ్లి సెర్చ్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని వారి చేతిలో కీలు బొమ్మలాగా మారుతున్నారు. ఇది సరికాదన్నారు.
Read Also : Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ