Bhatti Vikramarka: బంగారు తెలంగాణే భట్టి లక్ష్యం.. పాదయాత్రకు బ్రహ్మరథం!

తెలంగాణ సమస్యలను పరిష్కరించడం, పార్టీ పునర్ వైభవం తీసుకురావడమే  లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Bhatti

Bhatti

తెలంగాణ కాంగ్రెస్ (TCongress) అనగానే చాలామందికి గుర్తుకువచ్చే పేరు మొదటి పేరు  భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఎమ్మెల్యేగా, సీఎల్పీ నేతగా, ప్రజానేతగా వివిధ హోదాల్లో భట్టి కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో పాటు పడ్డారు. కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలలోని నాయకులను సైతం ఆకర్షించడంలో భట్టి ముందుంటారు. ఏదైనా రాజకీయ అంశం మీద సమగ్రంగా, అనర్గళంగా, సూటిగా మాట్లాడే నేత. సహజంగా మూడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికైన వ్యక్తి మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. అలాంటిది మధిర నియోజకవర్గంపై భట్టికి ఉన్న పట్టు మరే నేతకు లేదని చెప్పొచ్చు. ఇక టీడీపీ, సీపీఎం, కమ్యూనిస్టు పార్టీలు, కుల సంఘాలు సైతం భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నాయంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. భట్టి లాంటి ఫిగర్ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలో అంజనం వేసి వెతికినా దొరకడు అనేది ముమ్మాటికీ నిజం.

భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం

తెలంగాణ రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం, కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకురావడమే  లక్ష్యంగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో పాదయాత్ర (Padayatra) చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఊరు, ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో భట్టి పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. భట్టి పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు (టీడీపీ కార్యకర్తలు) కనిపించడం, భట్టి పచ్చ జెండా కండువాను కప్పుకోవడం, సీపీఎం కార్యకర్తలు సైతం భట్టి అడుగుల్లో అడుగు వేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాపై టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో భట్టి తెలుగు తమ్ముళ్లను కలుపుకొని పోవడం, ఆ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కూడా సంఘీభావం ప్రకటించడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

 రికార్డుస్థాయిలో పాదయాత్ర

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిందంటే భట్టి లక్ష్య సాధన ఎలాంటి అర్ధం చేసుకోవచ్చు. భట్టి పాదయాత్ర నిన్నటితో 50 రోజులకు చేరి మరింత ముందుకెళ్తోంది. గిరిజనుల కష్టాలు, (Rural People)వారి తాండాలకే వెళ్లి ప్రతి విషయాన్ని తెలుసుకొని వారికి అండగా నిలిచిన పద్ధతి భట్టి విక్రమార్క ఉదార హృదయానికి తార్కాణం. అంతేకాదు.. రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెల కాపర్లు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, మహిళలు, వృద్ధులు ప్రతిఒక్కరినీ కలుపుకొనిపోతూ ముందుకు సాగుతున్నారు. వారి మనసులను గెలుచుకుంటూ ఉరూర పాదయాత్ర కొనగిస్తున్నాడు.

మార్పే లక్ష్యంగా

మార్పు లక్ష్యంగా..తెలంగాణ (Telangana) ఉజ్వల భవిష్యత్తు చూడాలంటూ భట్టి నినాదం తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినా, బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించినా జనం భట్టికి జేజేలు కొడుతున్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలతో కాకుండా సామాన్య జనం కూడా భట్టి అడుగులో అడుగు వేస్తూ మద్దతు పలుకుతున్నారు. ప్రజలలో ఆయనకి వస్తున్న ఆదరణ అజరామరం. భట్టి పాదయాత్రతో తెలంగాణ భవిష్యత్తు బంగారుమయం.

Also Read: Pawan and Sai Dharam Tej: పవన్ మావయ్యే నా గురువు, మా ఇద్దరిది గురుశిష్యుల బంధం: సాయితేజ్

  Last Updated: 06 May 2023, 01:21 PM IST