తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని.. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని తెస్తామని మాట ఇస్తున్నామని.. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయనన్నారు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని.. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధరణి అనేది తెలంగాణలో మహమ్మారి లాగా అయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రజలు అడిగారని తెలిపారు. చేనేత కార్మికులు
జీఎస్టీ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారని.. నిరుద్యోగ యువత కాంగ్రెస్ కి పట్టం కట్టాలని చూస్తున్నారని తెలిపారు. సింగరేణిని బొంద పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ధరణితో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని.. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని భట్టి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని.. తెలంగాణలో స్వేచ్ఛనే లేకుండ పోయిందన్నారు.
CLP Leader Bhatti : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి – సీఎల్పీ నేత భట్టి

Bhatti 667a8aa210