Site icon HashtagU Telugu

Fee Reimbursement: ‘ఫీజు రీయింబర్స్’ ప్లీజ్!

Fee

Fee

తెలంగాణ బడ్జెట్ సెషన్‌కు ముందు, కాలేజీ మేనేజ్‌మెంట్స్, వృత్తిపరమైన ఆయా విద్యాసంస్థలకు పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యాసంస్థల వివరాల ప్రకారం.. ప్రభుత్వం గత చాలా నెలలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికేట్లను నిలిపివేయాల్సి వచ్చింది. విద్యార్థులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి మూడునెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్ మెంట్‌ను విడుదల చేయాలి. ఇదొక్కటే కాదు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కళాశాలల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ అన్నారు.

ప్రభుత్వం నుంచి సకాలంలో సొమ్ము అందకపోతే తమ సంస్థలను నడపడం కష్టమని ప్రైవేట్ కాలేజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘కరోనా మహమ్మారి సమయంలో, మేము అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. కొన్ని సంస్థలు మూతపడే దశలో ఉన్నాయి. ప్రభుత్వం మాకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను సకాలంలో చెల్లించకపోతే, మేం అప్పులు తెచ్చుకొని విద్యాసంస్థలను నడిపాం. ఆ అప్పుల భారం కూడా అలాగే ఉంది. ఫీజు రీయింబ ర్స్ మెంట్‌ను ప్రభుత్వం క్రమబద్ధీకరించే సమయం ఆసన్నమైంది’’ అని ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ అన్నారు.