Site icon HashtagU Telugu

Siddipet: హార్ట్ ఎటాక్ తో 8వ తరగతి విద్యార్థిని మృతి

Siddipet

Siddipet

Siddipet:  యువత హృదయాలను స్ట్రోక్ కబళిస్తోంది. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. కారణం ఏదైనా కావొచ్చు కరోనా మహమ్మారి తర్వాత హార్ట్ స్ట్రోక్ మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెద్ద వారిలో గుండెపోటు రావడం గురించి వదిలేస్తే.. యువతలో అదేవిధంగా ఇటీవల కాలంలో టీనేజర్లలోనూ రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సిద్దిపేటలో ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందడం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో బుధవారం 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధిని లాక్షణ్య(13) జ్వరంతో బాధపడుతుండగా వైద్యురాలు సూచించిన టాబ్లెట్ వేసుకుంది. బుధవారం ఆమె బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడిపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చేర్చగా గుండెపోటుతో చనిపోయిందని వైద్యలు తెలిపారు.

చిన్న వయసులోనే గుండెపోటుతో బాలిక చనిపోయిందంటూ జరిగిన సంఘటన గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లడం ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాక్షణ్య కన్నుమూయడంతో స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: TS : రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా..? : సీఎం రేవంత్