Site icon HashtagU Telugu

Huzurabad: హుజురాబాద్ లో ఉద్రిక్తత… టీఆరెస్ వర్సెస్ బీజేపీ…!!

Trs Bjp

Trs Bjp

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. దీంతో హుజురాబాద్ లో రాజకీయాలు మరింత హీటెక్కాయి. అంబేద్కర్ చౌరస్తా దగ్గర టీఆరెస్, బీజేపీ నాయకులు పోటా పోటీగా జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ డెవలప్ పై చర్చకు రావాలంటూ టీఆరెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు గురువారం సాయత్రం టీఆరెస్ నాయకుడు ఒకరు బీజేపీ నాయకుడిపై కర్రలతో దాడి చేశారు. దీంతో బీజేపీ, టీఆరెస్ నాయకుల మధ్య పరస్పర దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈ ఘటనలో ఇరు పార్టీల నాయకులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ శ్రీనివాస్ కు గాయం అయ్యింది. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టిన పోలీసులు… కొందరిని అరెస్టు చేశారు.

గంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. హుజురాబాద్ డెవలప్ మెంట్ గురించి చర్చకు రావాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి… అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగం కావద్దంటూ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తాము తలచుకుంటే పొలిమేర దాకా తరిమి కొట్టగలం… చిల్లర మాటలు నమ్మవద్దని ఈటల అన్నారు.