Sathupalli : పోడుభూముల గొడవ..పోలీసులను పరుగులు పెట్టించిన గిరిజనులు

బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల వ్యవహారం ఘర్షణకు దారితీసింది

Published By: HashtagU Telugu Desk
Clash Between Tribals Attac

Clash Between Tribals Attac

ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli ) మండలంలోని బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల వ్యవహారం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో (Tribals Attacked)కొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ఈ వివాదంలో సత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి.

సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు లోని చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను సర్దుమణిగించేందుకు గాను సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు. సత్తుపల్లి సిఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరువర్గాలని సమన్వయ పరచడానికి ప్రయత్నం చేశారు. ఈ సమన్వయ పరిచే సందర్భంగా గిరిజనుల్లో ఒక వర్గం కర్రలు తీసుకొని పోలీసులపై దాడికి పాల్పడింది. గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు వున్న పోలీసుల వెంట పడడం తో వారంతా పరుగులుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనలో సత్తుపల్లి సీఐ కిరణ్, ఇద్దరు గిరిజన మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ గొడవకు కారణమైన 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ పోడు సమస్య రగులుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఓ ఫారెస్ట్ రేంజి అధికారిని హతమార్చిన విషయం విదితమే.

Read Also : MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

  Last Updated: 31 Mar 2024, 07:22 PM IST