సుప్రీంకోర్టు జడ్జి చేతుల మీదుగా హైకోర్టు భవనానికి శంకుస్థాపన

సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు

Published By: HashtagU Telugu Desk
New Hc

New Hc

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి (New HC Building) రేపు శంకుస్థాపన (Lay the Foundation Stone) చేయనున్నారు. సుప్రీంకోర్టు జడ్జి (CJI) డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త హైకోర్టును నిర్మించబోతున్నారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరు కావడం లేదు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కారణంగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా అటెండ్ అవుతున్నారు. అత్యాధునిక పద్ధతిలో నిర్మించే ఈ భవనంలో కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులకు సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించబోతున్నారు. కాకపోతే వ్యవసాయ యూనివర్సిటీ భూములను లాక్కోవద్దని విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు, తీవ్ర ఆందోళనలు చేస్తూ వస్తున్నారు..వీరికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలికాయి..ఈ తరుణంలోనే రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. మరి దీనిని విద్యార్థులు , ప్రతిపక్ష పార్టీలు ఏమైనా అడ్డుకుంటాయా అనేది చూడాలి.

Read Also : Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్

  Last Updated: 26 Mar 2024, 11:08 PM IST