Site icon HashtagU Telugu

Red Sanders: ఎర్రచందనం స్మగ్లింగ్ పై వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ

CJI Ramana

CJI Ramana

ఎర్రచందనం చెట్ల నరికివేత కేవలం జాతిసంపదను దోచుకోవడమే కాదని దానివల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు.

సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ పై రాసిన పరిశోధనాత్మక పుస్తకం ‘బ్లడ్ శాండర్స్’ ను జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు.

రచయిత ఉడుముల కుటుంబంతో తనకు ఎంతో అనుబంధముందని,
ఉడుముల సుధాకర్ రెడ్డి వాళ్ళ బాబాయి జోజిరెడ్డి, తాను అమరావతిలోని ఎస్ఎస్ఎన్ కళశాలలో చదువుకున్నామని, సుధాకర్ రెడ్డి తండ్రి రాయపరెడ్డి తనకు సీనియర్ అని జస్టిస్ రమణ తెలిపారు. పాతరోజులే బాగుండేవని, ఆరోజుల్లో కులమతాల తేడాలు లేకుండా అందరూ కలిసి ఉండేవారని, ఆ ఊరూవాడా గుర్తుకొస్తున్నాయని, నాటి మిత్రులు గుర్తుకొస్తున్నారని, త్వరలో ఆ ఊరిలో పర్యటిస్తానని ఎన్వీ రమణ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

Also Read: ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

జర్నలిజం ప్రారంభం రోజుల్లో సుధాకర్ రెడ్డి తనకు పరిచయమని, ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లర్లు, చెట్ల నరికివేత, స్మగ్లింగ్ తదితర అంశాలను ఈ పుస్తకంలో తెలిపారని జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.

గత రెండు దశాబ్దాల కాలంలో అరవై లక్షల ఎర్ర చందనం చెట్లను నరికివేసినట్లు రచయిత చెప్పడం ఆందోళన కల్గిస్తుందని, 5,30,097 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం అడవుల్లో రెండు వేల మంది స్మగ్లర్లను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని, ఈ ప్రాసెస్ లో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారన్నారని రచయిత పేర్కొన్నారని, బ్లడ్ సాండర్స్ పుస్తకం వెనక సుధాకర్ రెడ్డి చేసిన పరిశోధన, కృషి ఎంతో దాగి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు.

Also Read: పాపం బాబు.! బాల‌య్య క‌న్నీళ్ల క‌థ‌!!

రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్ జర్నలిస్టుగా ఆయన చేసిన కృషి ఈ పుస్తకంలో స్పష్టంగా కన్పిస్తుందని, నడవటానికి కూడా కష్టమైన అడవుల్లో విస్తృతంగా సుధాకర్ రెడ్డి ప్రయాణించి స్మగ్లర్లతోనూ, అధికారులతోనూ నేరుగా మాట్లాడి ఈ పుస్తకరచన చేశారని, ఈ పుస్తకం రాయడానికి అత్యంత అర్హత ఉన్న వ్యక్తి సుధాకర్ రెడ్డి అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.

Exit mobile version