Heavy Traffic: పల్లె బాటలో ‘సిటీ’జనం.. స్తంభించిన ట్రాఫిక్!

హైదరాబాద్ లోని పలు హైవేలు, టోల్ ప్లాజాలు వేలకొద్దీ వాహనాలతో కిక్కిరిసి (Heavy Traffic) కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - January 12, 2023 / 03:16 PM IST

సంక్రాంతి (Sankranti) పండుగను జరుపుకునేందుకు భాగ్యనగరం (Hyderabad) పల్లెబాట పడుతుంది. బంధుమిత్రులు, స్నేహితులతో గడిపేందుకు మూడు రోజుల పాటు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో సిటీ శివారులోని పలు హైవేలు, టోల్ ప్లాజాలు వేలకొద్దీ వాహనాలతో కిక్కిరిసి (Heavy Traffic) కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ (Heavy Traffic) స్తంభించింది. పండుగల నిమిత్తం ప్రజలు స్వగ్రామాలకు వెళ్లడం ప్రారంభించడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు 10 గేట్లను కేటాయించగా, మొత్తం 16 టోల్ గేట్లలో హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు ఆరు గేట్లను కేటాయించారు.

అయితే హైదరాబాద్-విజయవాడ మార్గంలో దాదాపు అర కిలోమీటరు మేర టోల్‌ప్లాజా వద్ద వాహనాల రాకపోకలకు (Heavy Traffic) అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రికి NH 65లో ట్రాఫిక్ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. బోగీలోకి ఎక్కడమూ పెద్ద ప్రయాసగా మారింది. గురువారం ప్లాట్‌ఫాంపైకి వస్తున్న హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ బోగిలో చోటు కోసం ప్రయాణికులు పరుగెడుతూ పట్టు పడిపోయారు. ప్రయాణికులతో రైల్వేస్టేషన్స్ అన్నీ దాదాపుగా నిండిపోయాయి. రైళ్లో (Trains) సీటు కోసం పోటీ పడుతూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.