Site icon HashtagU Telugu

Revanth Cheating : దేవుళ్ల‌ను కూడా మోసం చేసిన చిట్టి నాయుడు – కేటీఆర్

Revanth Cheating

Revanth Cheating

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రజలనే కాదు దేవుళ్లను సైతం మోసం చేసాడని విమర్శించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..పదినెలలు పూర్తి కావొస్తున్నా ఇంకా హామీలు అమలు చేయలేదంటూ బిఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో రైతులను దారుణంగా మోసం చేసిందని చెప్పి రైతులు , ప్రతిపక్ష పార్టీలు కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈరోజు శనివారం మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో కేటీఆర్ (KTR) పాల్గొని రేవంత్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. రేవంత్ ప‌రిపాల‌న ప‌ది నెల‌లు నిండేందుకు వ‌చ్చింది.. కానీ రుణ‌మాఫీ పూర్తిగా మాఫీ కాలేదు. సెక్ర‌టేరియ‌ట్‌లో ప్ర‌భుత్వ ప‌రిపాల‌న యంత్రాంగం ఉంటుంది. కానీ సీఎం మాత్రం లంకె బిందెలు ఉంటాయ‌ని సెక్ర‌టేరియ‌ట్ వెళ్లిండ‌ట‌. ఇలాంటోడు మ‌న ముఖ్య‌మంత్రి. చివ‌ర‌కు క‌నిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి.. పంద్రాగ‌స్టు వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తా అన్నాడు. ఏ దేవుడిని విడిచి పెట్ట‌లేదు. మ‌న‌షుల‌నే కాదు చివ‌ర‌కు దేవుళ్ల‌ను కూడా మోసం చేసిండు చిట్టి నాయుడు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకు, రైతులను మభ్యమ్ పెట్టడం మొదలుపెట్టాడు. దొడ్డు వ‌డ్ల‌కు బోన‌స్ ఇస్తా అన్నాడు. ఈరోజు స‌న్న వ‌డ్ల‌కు ఇస్తా అంటుండు. రుణ‌మాఫీ, బోన‌స్, రైతు బంధు పేరుతో మోసం చేసిండు. రాష్ట్రంలోని ప్ర‌తి వ‌ర్గాన్ని రేవంత్ మోసం చేసాడు. ఇంట్లో ఇద్ద‌రికి పెన్ష‌న్ ఇస్తా అన్నాడు. కోడళ్ల‌కు కూడా ఇస్తా అన్నాడు. బతుక‌మ్మ చీర‌లు లేనే లేవు. ద‌స‌రా పండుగ పండుగ‌లా లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. ఆరు గ్యారెంటీలు నూరు రోజులు.. ఆరునైరైనా అమ‌లు చేస్తా అన్నాడు. ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు.. ఇప్పుడేమో ఉన్న ఇండ్ల‌ను కూల‌గొడుతున్నాడు అని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Read Also : IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో స‌మ‌స్య‌.. నిలిచిపోయిన సేవ‌లు