Site icon HashtagU Telugu

Mega Star: చిరుకి AICC బర్తడే గిఫ్ట్..దీని వెనక ఇంత కథ ఉందా?

Chiranjeevi Id Card

Chiranjeevi Id Card

Mega Star Birthday Gift: మెగాస్టార్ చిరంజీవి (Mega Star) పుట్టినరోజు (Birthday) వేడుకలను దేశ, విదేశాలలో ఆయన అభిమానులు (Fans) ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ వేకువ జామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి (Lord Balaji) ఆశీస్సులు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు భారతదేశంలో, విదేశాల్లో ఉంటున్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ (AICC) మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ (Shock) ఇచ్చింది. గతంలో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) స్థాపించిన తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో (Congress) విలీనం చేశారు. ఆ తరువాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో (Upa Govt) కేంద్ర మంత్రిగా (Centrel Minister) కూడా పని చేసారు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.

ఖైదీ నెంబర్ 150తో సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ (Re Entry) ఇచ్చారు. అప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి (Mega Star) ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చిరంజీవి పూర్తిగా దూరం అయ్యారు. సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ (Jansena Party) పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర  (Modi) మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి (Chiranjeevi) కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని 2027 అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును (ID Card) కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు షాక్ (Shock) అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా అందరూ వేడుకులు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యుత్వం రెన్యువల్ చేసిన ఐడీ కార్డు బయటకు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు.