Site icon HashtagU Telugu

Chiranjeevi Visits Yashoda Hospital : కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి

Megastar Chiranjeevi Visits

Megastar Chiranjeevi Visits

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..గాయపడి యశోద హాస్పటల్ (Yashoda Hospital) లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలే కాకుండా చిత్రసీమ ప్రముఖులు సైతం హాస్పటల్ కు చేరుకొని కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పటు పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈరోజు సోమవారం మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో పాటు సినీ నటులు ప్రకాష్ రాజ్ (Prakash Raj) హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను చూసి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

తాజాగా కొద్దీ సేపటి క్రితం మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం హాస్పటల్ కు వచ్చారు. కేసీఆర్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల చిరంజీవి మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, హుషారుగా ఉన్నారని తెలిపారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చునని వైద్యులు చెప్పారన్నారు. సర్జరీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారన్నారు.

కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. తనను సినిమా పరిశ్రమ గురించి అడిగినట్లు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని కేసీఆర్ అడిగినట్లు తెలిపారు. ఇక చిరంజీవి వచ్చిన సమయంలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో పాటు కూతురు కవిత లు అక్కడే ఉన్నారు. కేటీఆర్ భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా చిరంజీవి పలకరించి, కవితకు నమస్కరించి లోనికి వెళ్లారు. అంతకు ముందు మాజీ సీఎం చంద్రబాబు సైతం హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు. ఇలా ప్రతి రోజు ఎంతోమంది కేసీఆర్ ను చూసేందుకు హాస్పటల్ కు వస్తుండడం తో అక్కడ సందడి సందడి గా మారింది.

Read Also : Upcoming Cars: 2024 జనవరిలో విడుదలయ్యే కార్ల లిస్ట్ ఇదే.. వాటి ఫీచర్లు ఇవే..!