Megastar Comments: అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో చిరు ఇంట్రస్టింగ్ కామెంట్స్

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Published By: HashtagU Telugu Desk
Chiru

Chiru

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కళాకారులతో డప్పు వాయించి, పోతురాజులతో స్టెప్పులేసి స్పెష‌ల్‌గా నిలిచారు. ఎప్పట్నుంచో అలయ్ బ‌ల‌య్‌కు రావాలనుకున్నానని, గతేడాది తమ్ముడు పవన కల్యాణ్‌కి అవకాశం వచ్చిందన్నారు. దత్తన్న దృష్టిలో తానేందుకు పడలేదో అనుకున్నానని, గాడ్ ఫాదర్‌తో హిట్ కొట్టిన మర్నాడే పిలువు వచ్చిందని చిరు అన్నారు.

అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనుషుల మధ్య విద్వేషాలను తగ్గించి ప్రేమానురాగాలను పెంపొందించేందుకు అలయ్ బలయ్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. దత్తన్న ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి తన ఆలోచన విధానానికి పోలిక ఉందని ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణ సంస్కృతిలో ఎన్నో ఏళ్లుగా భాగంగా ఉన్న అలబ్ బలయ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రాచూర్యం తీసుకురావడంలో దత్తాత్రేయ ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయాల్లో పార్టీల మధ్య సిద్ధాంతాలు ఎలా ఉన్నా అందరూ మానవీయకోణంలో ఉండాలని సూచించారు. గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ కొట్టిన మరుసటి రోజే ఈ విధంగా నేను మీ ముందుకు రావడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ నేత హనుమంతరావుకు దూరమైన నాటి నుంచి తనకు ఎంటర్ టైన్ మెంట్ దూరం అయిందని చిరంజీవి చేసిన కామెంట్స్ స్టేజీపై నవ్వులు పూయించాయి. కాగా ఫ్యాన్స్ విషయంలో, రాజకీయ పార్టీల సిద్ధాంతాలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల చిరంజీవి రాజకీయాలపై చేస్తున్న కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి.

  Last Updated: 06 Oct 2022, 05:15 PM IST