Site icon HashtagU Telugu

Chiru-Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి, ఫొటో వైరల్

Chiru And Revanth

Chiru And Revanth

Chiru-Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఫోటోలు, వీడియోల ద్వారా ఇంటర్నెట్‌లో వేగంగా వ్యాపించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన తొలి సినీ ప్రముఖుడు చిరంజీవి కావడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కొత్త మంత్రివర్గంలోని సభ్యులందరికీ, సీఎల్పీకి చిరు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఇటీవలనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో దిల్ రాజుతో పాటు ఇతర టాలీవుడ్ పెద్దలున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అతి కొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఇతర మంత్రులను కానీ కలిశారు. ఈ నేపథ్యంలో చిరు ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Also Read: KTR: చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్