Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నివాసం అంశంలో తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న తన ఇంటిని పునరుద్ధరించిన సమయంలో చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం చిరంజీవి గతంలో GHMC అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, చిరంజీవి పునరుద్ధరణకు అనుమతి పొందినప్పటికీ, ఆ తర్వాత దాఖలైన క్రమబద్ధీకరణ దరఖాస్తుపై అధికారులు ఏలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హైకోర్టు విచారణ.. ఇరుపక్షాల వాదనలు
ఈ కేసును జస్టిస్ బీ విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ, 2022లో జీహెచ్‌ఎంసీ అనుమతితో జీ+2 స్థాయిలో పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం అధికారులు నిర్మాణాన్ని పరిశీలించి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను సమర్పించినప్పటికీ, వాటిపై స్పందన లేదని వివరించారు.
జీహెచ్‌ఎంసీ వాదన.. చట్టప్రకారం చర్యలు
జీహెచ్‌ఎంసీ తరపున న్యాయవాది మాట్లాడుతూ, సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానాన్ని హామీ ఇచ్చారు.
హైకోర్టు ఆదేశాలు.. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలి
వాదోపవాదనలు విన్న అనంతరం, హైకోర్టు జీహెచ్‌ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి దాఖలు చేసిన దరఖాస్తును చట్టపరంగా పరిశీలించి, నాలుగు వారాల వ్యవధిలో తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశించింది. ఈ అంశంపై హైకోర్టు జోక్యంతో చిరంజీవికి తుది పరిష్కారానికి దారి కనిపిస్తున్నట్లయింది. చిరంజీవి నివాసంపై నెలకొన్న సందిగ్ధత ఈ ఆదేశాలతో తీరే అవకాశం ఉంది.
Shubanshu Shukla : భూమికి చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..యాక్సియం-4 మిషన్ విజయవంతం