Site icon HashtagU Telugu

Chinna Reddy : సొంతపార్టీనే విమర్శించిన కాంగ్రెస్ నేత

Chinna Reddy

Chinna Reddy

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి (Chinna Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ పార్టీ అభ్యర్థికి ఓటమి ఎదురైందని, ఈ ఎన్నికల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు బహిరంగంగా తెలిపారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి.

OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా

చిన్నారెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలు బిఆర్‌ఎస్ (BRS) పార్టీకి వరంగా మారాయి. ముఖ్యంగా హరీష్ రావు (Harish Rao) ఈ వ్యాఖ్యలను ప్రధాన అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, సొంత పార్టీ నాయకుడే ఈ విషయాన్ని అంగీకరించారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల్లో భారీగా డబ్బు వాడకాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ, ఐటీ శాఖలు ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, బహిరంగ విమర్శలు చేయడం పార్టీ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతోంది. అధికారంలో ఉన్నప్పటికీ క్రమశిక్షణ కోల్పోతున్న పార్టీ, తన సొంత నేతల చేతనే విమర్శలు ఎదుర్కొనడం కాంగ్రెస్ పరిస్థితిని దయనీయంగా మార్చింది. ఈ వ్యవహారం భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Delhi : సీఎం రేవంత్ కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారు