KCR and Chinna Jeeyar: కల్యాణం ఆ ‘ఇద్దర్నీ’ కలపనుందా?

  • Written By:
  • Updated On - March 13, 2022 / 07:41 PM IST

చిన జీయర్ ఆధ్వర్యంలో శాంతికల్యాణం సోమవారం జరగబోతోంది. ముంచింతల్ లోని రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క్రణ తరువాత జరుగుతోన్న అతి పెద్ద కార్యక్రమం ఇది. దీనికి ముఖ్య అతిధిగా కేసీఆర్ హాజరుకావాలి. కానీ, చినజీయర్, కేసీఆర్ మధ్య వివాదం నెలకొందని వస్తున్న ప్రచారం తాలూకా అంశానికి ఈ కల్యాణం ముడిపడింది. వాస్తవంగా విగ్రహం ఆవిష్కరణ తరువాత వరుసగా జరిగే కార్యక్రమాల్లో కళ్యాణం ఉంది. ముగింపు కల్యాణం ను కేవలం కేసీఆర్ కోసం ఆపారని జియ్యర్ ట్రస్ట్ వర్గాల వినికిడి. ప్రధాని, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాల్లో కేసీఆర్ కు ప్రాధాన్యత లేదు.

శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు పొందుపరచటానికి ప్రధాని, రాష్ట్రపతి ఆఫీసులు నిరాకరించాయి. ప్రోటోకాల్ విరుద్ధంగా కేసీఆర్ పేరు పెట్టడానికి లేదని మోడీ, కొవిద్ వచ్చిన రోజు తొలగించారు. ఆహ్వాన పత్రంలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు పెట్టలేదు. దీంతో జియర్, కేసీఆర్ మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదానికి తెర వేయడానికి ముగింపు కళ్యాణం ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను జీయర్ ఆశ్రమం ఆహ్వానించింది. కానీ, ఆయన వస్తాడా? రాడా? అనేది జీయర్ ఆశ్రమ వర్గాల టెన్షన్. ఒక వేళ ముగింపు కళ్యాణంకు కేసీఆర్ హాజరు అయితే వాళ్లిద్దరి మధ్యా పొడచూపిన వివాదం సద్దుమణిగిందని భావించాలి.

తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే కేసీఆర్ కొంతకాలంగా ముచ్చింతల్ వైపు చూడలేదని ప్రచారం జోరుగా సాగుతోంది. చినజీయర్‌ మీద కేసీఆర్ కోపంగా ఉన్నాడని ప్రగతిభవన్ వర్గాల వినికిడి. దీంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి ? అందులోనూ చినజీయర్ కీలకంగా వ్యవహరించే యాదాద్రి పునర్ ప్రారంభం వేడుకపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. . తాజాగా ఈ ప్రచారంపై చినజీయర్ స్వామి స్పందించారు. తమకు విభేదాలు లేవని తెలిపారు. కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నదని, అందుకే రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం అయిందని ప్రశంసించాడు.

ఈ కార్యక్రమానికి మొదటి సేవకుడినని కేసీఆరే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సోమవారం జరగనున్న శాంతి కళ్యాణానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన విషయాన్ని చినజీయర్ స్వామి వెల్లడించాడు. ఆయన వస్తారో రారో చూడాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే కేసీఆర్ లేదా ఆయన కుటుంబసభ్యులు రేపు ముచ్చింతల్ జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగే శాంతి కళ్యాణానికి హాజరవుతారా ? లేదా ? అనే అంశంపైనే విభేదాలు ఉన్నాయా ? లేదా? అనే దానిపై క్లారిటీ రానుంది. సీఎం కేసీఆర్ రేపు ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి వెళ్లకపోతే మాత్రం.. చినజీయర్ విషయంలో ఆయనకు కోపం తగ్గలేదనే అంశానికి మరింత బలం చేకూరుతుంది. సో.. కేసీఆర్, జీయర్ మధ్య జరుగుతున్న తతంగానికి సోమవారం ఫుల్ స్టాప్ పడనుంది.