TS: విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..!!

శనివారం హైదరాబాద్ లో ఆదివాసీ, బంజారాల ఆత్మయ సభ జరిగింది. ఈ సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాలజల్లులు కురిపించారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 06:50 AM IST

శనివారం హైదరాబాద్ లో ఆదివాసీ, బంజారాల ఆత్మయ సభ జరిగింది. ఈ సభలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. 5 నుంచి 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు…10శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ తీర్మానం రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమకు రావాల్సిన హక్కునే కోరుతున్నామన్నారు. మోదీ ఆ జీవోను అమలు చేస్తారా..లేదా అన్న సీఎం కేసీఆర్…వారం రోజుల్లో పది శాతం రిజర్వేషన్ల జీవో రిలీజ్ చేస్తామన్నారు.

గురుకులాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం…ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్నాం. కల్యాణలక్ష్మీ, ఇతర ప్రభుత్వ పథకాలు సమాజంలో అందరికీ అందించినట్లుగానే గిరిజన బిడ్డలకు కూడా అందించుకుంటున్నం. ఎస్టీ గురుకులాల్లో చదివిని 2వందల మంది అద్భుతమైన ప్రతిభ చూపి డాక్టర్లుగా గొప్ప గొప్ప చదువుల్లోఉన్నారు. ఈ ఏడాది మరిన్ని గురుకులాలను పెంచుతం. వారి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే భరిస్తాం. జాతి గర్వించే విధంగా గిరిజన బిడ్డలు ఎదగాలి. గిరిజన ఆడబిడ్డలు చదువుకోవాలి. తెలివైన గిరిజన బిడ్డలు ఎక్కడున్నారంటే…తెలంగాణలోనే ఉన్నారని దేశం చెప్పుకోవాలి అని అన్నారు సీఎం కేసీఆర్.

కాగా కొత్తగా మంజూరు చేసిన 33 బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలను అక్టోబర్ లో ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి పెరిగింది.