Site icon HashtagU Telugu

Chief Minister Chandrababu: ఆలయ ప్రధాన పూజారిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Chief Minister Chandrababu

Chief Minister Chandrababu

Chief Minister Chandrababu: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్‌పై దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chief Minister Chandrababu) నాయుడు తాజాగా ఎక్స్ వేదిక‌గా ఖండించారు. “చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ పై జరిగిన దారుణమైన సంఘటనను ఖండిస్తున్నాను. నాగరిక సమాజంలో గౌరవప్రదమైన సంభాషణలకు, అభిప్రాయ భేదాలకు ఎల్లప్పుడూ చోటు ఉండాలి. హింసకు స్థానం లేదు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది” అని ఆయ‌న పేర్కొన్నారు.

సీఎం రేవంత్ సైతం స్పంద‌న‌

పూజారి రంగరాజన్ పై దాడి విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం సోమ‌వారం స్పందించిన విష‌యం తెలిసిందే. రంగరాజన్‌కు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే రంగ‌రాజ‌న్‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

Also Read: Aero India : యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..!

అస‌లేం జ‌రిగింది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో చిలుకూరు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిపై దాడి విష‌యం సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి వ‌స్తున్నాయి. అయితే గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వీర రాఘవరెడ్డి (రామ‌రాజ్యం పేరుతో సంస్థ‌) బృందం వెళ్లింది. రామరాజ్యానికి సైన్యం తయారు చేస్తున్నాను అని వీర రాఘ‌వ‌రెడ్డి.. అర్చ‌కుడు రంగ‌రాజన్‌కు చెప్పారు. అలాగే ప్రతి శనివారం చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తన సైన్యంలో చేర్పించాలని డిమాండ్ చేశాడు వీర రాఘ‌వ‌రెడ్డి. అలా చేయడం కుదరదు అని రంగరాజన్ తెలిపారు. దీంతో తాను చెప్పినట్లు వినాలంటూ రంగరాజన్ పై వీర రాఘవరెడ్డి దాడి చేశాడు. అంతేకాకుండా ఓ వీడియో సైతం రికార్డు చేశారు. రంగరాజన్ పై దాడి తర్వాత బెదిరిస్తూ వీడియో రికార్డ్ చేశారు. అయితే రంగ‌రాజ‌న్‌పై దాడి చేసిన వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్, అనపర్తి నియోజకవర్గ వాసిగా పోలీసులు గుర్తించారు.