గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ (Bird Flu) భయం కారణంగా చికెన్ (Chicken ) వ్యాపారం కుదేలైంది. హైదరాబాద్ , విజయవాడ , విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు చికెన్ కొనడానికి భయపడ్డారు. దీంతో చికెన్ మార్కెట్లు వెలవెలబోయాయి. వ్యాపారస్తులు భారీ నష్టాలను చవిచూశారు. కొన్ని ప్రాంతాల్లో అనేక కోళ్లు చనిపోవడంతో వాటిని భూమిలో పాతిపెట్టాల్సి వచ్చింది. తాజాగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలు ఈ భయాన్ని మరచిపోతున్నారు. ఈరోజు ఆదివారం మాంసాహార ప్రియులు పెద్ద సంఖ్యలో చికెన్ షాపుల వద్ద బారులు తీరారు. దీంతో వ్యాపారులకు ఊరట కలిగింది.
Himani Narwal: సూట్‌కేసులో కాంగ్రెస్ కార్యకర్త డెడ్‌బాడీ.. హిమానీ నార్వాల్ ఎవరు ?
గడిచిన కొన్ని రోజులుగా ఎండలు పెరగడంతో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి తర్వాత చికెన్ అమ్మకాలు పెరిగాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇక భయాలు తగ్గిన నేపథ్యంలో ప్రజలు మళ్లీ సాధారణంగా చికెన్, గుడ్ల కొనుగోళ్లను మొదలు పెట్టారు. అయితే వేసవి ప్రభావంతో కోళ్ల పెంపకం ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో చికెన్ ధరలు కేజీకి రూ.50 వరకూ పెరిగాయి. వ్యాపారస్తుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో కోళ్ల పెంపకంలో ఇబ్బందులు రావడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశముంది.
Meenakshi Chaudhary: ‘మహిళా సాధికారత’ బ్రాండ్ అంబాసిడర్‌గా హర్యానా బ్యూటీ
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో చికెన్, మటన్, చేపల ధరలు పెరుగుతున్నాయి. విజయవాడలో కేజీ చికెన్ ధర రూ.200కు చేరుకోగా, కాకినాడలో రూ.150-170 మధ్య ఉంది. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.180గా ఉంది. ఇది గతంతో పోలిస్తే రూ.50 పెరిగింది. మటన్ ధర కూడా ఒక్కసారిగా పెరిగి, రూ.1000 మార్క్‌ను తాకింది. అలాగే చేపల ధరలు రూ.50-100 వరకు పెరిగాయి. మాంసాహార ప్రియులు డిమాండ్ పెరగడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.