Telangana BJP : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రత్నం.. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున.. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు

Published By: HashtagU Telugu Desk
Ratnam Bjp

Ratnam Bjp

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella ) మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం(EX MLA KS Ratnam )బిజెపి (BJP)తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పలు పార్టీల నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె ఉంటుందో దానికి తగ్గట్లు అడుగులేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ (Congress) లో పెద్ద ఎత్తున నేతలు చేరుతుండగా..మరికొంతమంది బిజెపి , బిఆర్ఎస్ లలో చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రత్నం.. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున.. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చి..నేడు బిజెపి పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని ..పదవులు కాదని.. ఇతర పార్టీలకు పదవులు ముఖ్యమని అన్నారు.

అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పనిచేయాలని కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనను ప్రజలు చూశారని.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలననూ చూశారని.. అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.

Read Also : BJP Second List : ఒకే ఒక్క అభ్యర్ధితో బీజేపీ సెకండ్ లిస్టు.. ఆ సీటుపై క్లారిటీ

  Last Updated: 27 Oct 2023, 03:00 PM IST